కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

కమల్ పై శ్రుతి హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Published on Oct 27, 2025 11:01 AM IST

కమల్ హాసన్ కుమార్తెగా సినీ లోకానికి పరిచయమైన శ్రుతి హాసన్ మొదటి నుంచి గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నటిగా ఇలా తనలోని మల్టీ టాలెంటెడ్ పర్సన్ ని అప్పుడప్పుడు ప్రేక్షకులకు పరిచయం చేస్తూనే వచ్చారు. ఐతే, తాజాగా శ్రుతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ, శ్రుతి హాసన్ ఏం మాట్లాడింది అంటే..‘నేను కమల్‌ హాసన్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమయ్యాను. కాబట్టి నాపై ఆయన ప్రభావం చాలా ఉంటుంది. నా నటనను ఆయన యాక్టింగ్‌తో పోలుస్తుంటారు. కానీ దాని వల్ల నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు’ అని చెప్పుకొచ్చింది.

శ్రుతి హాసన్ ఇంకా మాట్లాడుతూ.. ‘తమిళ చిత్ర పరిశ్రమలోని ఎంతోమందిలో మా నాన్న స్ఫూర్తిని నింపారు. మా నాన్న తన సొంత డబ్బు పెట్టి సినిమా తీసిన సందర్భాలు ఉన్నాయి. నాకు ఆయన గురించి బాగా తెలుసు. ఆయనది బాక్సాఫీసు నంబర్ల గురించి ఆలోచించే మనస్తత్వం కాదు. వాటి గురించి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తారు. అందుకే బాక్సాఫీసు నంబర్లు నా తండ్రిని ప్రభావితం చేయలేవు’ అని శ్రుతి హాసన్ తెలిపింది.

తాజా వార్తలు