జగపతి బాబు ఇంట్లో షూటింగ్ జరుపుకుంటోన్న వెంకటేష్ – మహేష్ చిత్రం

జగపతి బాబు ఇంట్లో షూటింగ్ జరుపుకుంటోన్న వెంకటేష్ – మహేష్ చిత్రం

Published on Jan 25, 2012 8:30 AM IST


విక్టరీ వెంకటేష్ మరియు ప్రిన్సు మహేష్ బాబు సంయుక్తం గా నటిస్తున్న కుటుంబ కథా చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిం నగర్ లోని హీరో జగపతిబాబు ఇంట్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. కథానాయికలలో ఒకరైన సమంతా షూటింగ్ లో పాల్గొంటున్నారు. కుటుంబానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే విశాఖపట్నం లో వెంకటేష్ మీద ఒక పాట ను చిత్రీకరించారు.

ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్నారు. మిక్కి మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బాబు సరసన సమంతా నటిస్తుండగా వెంకటేష్ సరసన అంజలి (జర్నీ ఫేం ) నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు