‘సూర్య’ సినిమా కోసం దుబాయ్ లో వెంకీ అట్లూరి !

తమిళ స్టార్ హీరో సూర్య తెలుగులో డైరెక్ట్ సినిమా చేయడానికి చాలా కాలంగా చూస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. పైగా సూర్యతో వెంకీ అట్లూరి తన సినిమాని స్టార్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇప్పటికే, ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసాడు. జీవి ప్రకాష్, సూర్య సినిమాకు వెంకీతో కలిసి మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాడు. అందుకోసం దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశారట.

అన్నట్టు, ఏ గెటప్ లు, సందేశాలు ఏమీ లేకుండా చక్కటి లవ్ స్టోరీని వెంకీ, సూర్యకి చెప్పారు. ఈ సినిమాకు హీరోయిన్ గా భాగ్యశ్రీ భోర్సే ను తీసుకునే ప్లాన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి గ్లామరస్ బ్యూటీ ‘కాయదు లోహర్’ను తీసుకోబోతున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. త్వరలోనే మోషన్ పోస్టర్ తో అధికారికంగా ఈ సినిమాను ప్రకటించనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version