అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌కు హాలీవుడ్ బూస్టప్..?

Allu Arjun Atlee

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న అట్లీ దర్శకత్వంలోని కొత్త చిత్రం ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఒకటి. ప్రస్తుతం AA22×A6 అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేసిన ఈ సినిమా ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. ఇటీవల అల్లు అర్జున్ ఇంట్రొడక్షన్ సీక్వెన్స్‌ను భారీ స్థాయిలో షూట్ చేశారు.

తాజా సమాచారం ప్రకారం, హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ స్టూడియో సన్ పిక్చర్స్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను కో-ప్రొడ్యూస్ చేయడానికి చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఏ స్టూడియో అనే వివరాలు బయటకు రాకపోయినా, చర్చలు ప్రారంభ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అదనంగా, ఈ సినిమా గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, యుఎస్‌ఏ-లోని ఒక క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి అంతర్జాతీయ ప్రమోషన్ ప్లాన్‌ను రూపొందించాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు సమాచారం.

Exit mobile version