సూర్య కోసం మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పట్టుకొస్తున్న వెంకీ అట్లూరి

సూర్య కోసం మరో ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పట్టుకొస్తున్న వెంకీ అట్లూరి

Published on Jul 2, 2025 7:00 PM IST

టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో దుల్కర్ సల్మాన్ కూడా తన ఖాతాలో అదిరిపోయే హిట్ వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించిన చిత్ర యూనిట్, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి ‘విశ్వనాథన్ అండ్ సన్స్’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కథకు అనుగుణంగా ఉండే ఈ టైటిల్ ప్రేక్షకులతో పాటు సినీ సర్కిల్స్‌ను కూడా ఆకర్షిస్తోంది. అయితే, ఈ సినిమాను ఎలాంటి కథతో వెంకీ తెరకెక్కిస్తున్నాడా.. అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో అందాల భామ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. జి వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు