విక్టరీ వెంకటేష్ ఈ మధ్య కాలంలో రీమేక్ లపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. తాజాగా బాలీవుడ్ ‘బోల్ బచ్చన్’ మూవీ రీమేక్ లో కనిపించిన వెంకటేష్ త్వరలోనే బాలీవుడ్ లో హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమా రీమేక్ లో కనిపించనున్నాడు. ఫిల్మ్ నగర్లో ఈ సినిమాకి సంబందించిన వార్తలు వినిపిస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నాయి. అలాగే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈ ప్రాజెక్ట్ విషయంలో సురేష్ ప్రొడక్షన్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
హిందీ ‘ఓ మై గాడ్’ సినిమాలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే అక్షయ్ కుమార్ పాత్రలో వెంకటేష్ కనిపించనున్నాడు. పరేష్ రావాల్ పాత్ర కోసం ఎవరిని ఎంచుకుంటారు? అనేది చూడాలి..