రానా రాబోతున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురు” చిత్రంలో ఒక ప్రత్యేక పాట ఉండబోతుంది తాజా సమాచారం ప్రకారం ఈ పాటలో వెంకటేష్ మరియు సమీర రెడ్డి కనపడనున్నారు ఇదే ఈ పాట ప్రత్యేకత. కొద్దిసేపే అయిన రానా మరియు వెంకటేష్ ఒకే తెర మీద కనిపించడం ఇదే మొదటిసారి . సమీర రెడ్డి చివరగా గౌతం మీనన్ “ఎర్ర గులాబీలు” చిత్రంలో కనిపించింది. ఈ పాట మినహా చిత్రం చిత్రీకరణ మొత్తం పూర్తయ్యింది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయిబాబా జాగర్లమూడి మరియు వై రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం ఒకేసారి తమిళంలో కూడా తెరకెక్కించారు. “కృష్ణం వందే జగద్గురు” చిత్ర ఆడియో కూకట్పల్లి అర్జున్ థియేటర్ లో అక్టోబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రం అక్టోబర్ చివర్లో విడుదల కానుంది.