ఘట్టమనేని హీరో కోసం విలన్‌గా మారిన మోహన్ బాబు..?

Mohan-Babu

టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్ డా.ఎం.మోహన్ బాబు తనకంటూ ఓ ప్రత్యేక పేజీ ని క్రియేట్ చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, మరెన్నో రికార్డులు ఆయన సొంతం. ఆయన ఓ సినిమాలో నటిస్తున్నారంటే, ఆ సినిమాలో మోహన్ బాబు పాత్ర ఖచ్చితంగా సినిమాకు మేజర్ అసెట్‌గా మారడం ఖాయమని అభిమానులు భావిస్తారు. ఇక కొంత గ్యాప్ తర్వాత ఆయన తిరిగి ఓ సినిమాలో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కాబోతున్న ఘట్టమనేని రమేష్ బాబు వారసుడు ఘట్టమనేని జయకృష్ణ నటించబోయే సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలో పట్టాలెక్కించబోతున్నారు. అయితే, ఈ సినిమాలో విలన్‌గా మోహన్ బాబు నటించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని.. ఇలాంటి రోల్స్ చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనేలా ఈ పాత్రను అజయ్ భూపతి డిజైన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version