మదరాసి సినిమా సెన్సార్ రిపోర్ట్.. రన్‌టైమ్ వివరాలు ఇవే..!

madharaasi

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మదరాసి. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్, టీజర్‌లతోనే మాస్ ఆడియన్స్‌లో బజ్ పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు మదరాసి చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఫుల్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వడం ఖాయం అని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 47 నిమిషాలుగా ఫిక్స్ అయింది.

ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version