ఓటీటీలో ‘కింగ్డమ్’కు షాకింగ్ రెస్పాన్స్.. ఇదెక్కడి ట్విస్ట్..!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీ ‘కింగ్డమ్’ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ రెస్పాన్స్ దక్కింది. ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత ఈ చిత్ర కలెక్షన్స్ భారీగా పడిపోవడంతో మేకర్స్ అనుకున్న స్థాయిలో ఈ చిత్రం విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే, ఈ చిత్రానికి ఓటీటీలో షాకింగ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రానికి ఓటీటీలో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా బాగానే ఉందని.. అయితే, మేకర్స్ ఈ చిత్రాన్ని సరిగా ప్రమోట్ చేయలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ఇందులో ఉన్న కథ వేరే అని.. సినిమాను బయటకు ప్రెజెంట్ చేసింది వేరేగా అని మరి కొందరు సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాకు ఓటీటీలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో భాగ్యశ్రీ బొర్సె, సత్యదేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Exit mobile version