విక్టరీ వెంకటేష్ నటించిన ‘బాడీగార్డ్’ చిత్రం సక్సెస్ కావడంతో ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. వయసు మీద పడుతున్న కూడా ఆయన వయసుకు తగ్గట్లు పాత్రలు ఎంచుకుంటున్నారు. బాడీగార్డ్ చిత్రాన్ని కూడా ఆయన తనదైన శైలిలో హాస్యాన్ని, సెంటిమెంట్ పండించి ప్రేక్షకులని అలరించారు. ఆయన తరువాత చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్నారు. చాలా రోజుల తరువాత తెలుగులో అసలుసిసలైన మల్టీస్టారర్ సినిమా రాబోతుంది. ఇవే కాకుండా వెంకీ ఇంకా రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఒకటి మెహెర్ రమేష్ డైరెక్షన్లో ‘షాడో’ కాగా మరొకటి తన డ్రీం ప్రాజెక్ట్ ‘స్వామి వివేకానంద’.