వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్

Published on Nov 22, 2013 4:15 PM IST

Venkatadri-Express1
త్వరలో విడుదల కానున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ వారు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. మేర్లపాక గాంధీ డైరెక్టర్ గా పరిచయమవుతున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ నిర్మించిన ఈ సినిమాకి రమణ గోగుల మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

ఈ మూవీలో సందీప్ కిషన్ సరసన రాకుల్ ప్రీత్ సింగ్ జోడీ కట్టింది. చోటా కె నాయుడు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడం వల్ల విజువల్స్ బాగుంటాయని ఆశించవచ్చు. అల్లరి నరేష్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

తాజా వార్తలు