సందీప్ కిషన్ ఇటీవల వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. అతను నటించిన మూడు చిత్రాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి
సందీప్ కిషన్ నటించిన ‘వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్’ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఈ సినిమా ఆడియో విడుదల ముందుగానే జరగాల్సివుంది. కాకపొతే హైదరాబాద్లో పలు ప్రాంతాలలో భారీ వర్షాలకారణాన ఈ వేడుక వాయిదాపడింది
ఐతే ఇప్పుడు ఈ ఆడియో విడుదల వేడుక మరో చోట ఇంతకన్నా భారీ రీతిలో రేపు 6.30 కి జరపనున్నారు . ఈ ఆడియోను భారీ రీతిలో జరిపి సుదీప్ తన అభిమానులకు సర్ప్రైజ్ ను ఇవ్వనున్నాడు
ఈ సినిమాలో రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. రమణ గోగుల అందించిన సంగీతం త్వరలో విడుదలకానుంది. ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ సినిమాను నిర్మించాడు. మేర్లపాక గాంధీ దర్శకుడు