రొమాన్స్ అండ్ రివేంజ్ యాంగిల్ లో వస్తున్నా..లిరికల్.

నాని కెరీర్ లో మొదటిసారి సీరియల్ కిల్లర్ గా చేస్తున్న చిత్రం వి. మరో హీరో సుధీర్ పోలీస్ అధికారి పాత్ర చేస్తున్నారు. కిల్లర్ నానిని పట్టుకోవడానికి వచ్చిన సీరియస్ పోలీస్ గా ఆయన కనిపించనున్నాడు. కాగా నేడు వి మూవీలోని వస్తున్న వచ్చేస్తున్నా…లిరికల్ వీడియో విడుదల చేశారు. శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి ఈ పాటను పాడారు.

సీరియస్ రివేంజ్ యాంగిల్ కలిగివున్న ఈ రొమాంటిక్ సాంగ్ భిన్నంగా ఉంది. నివేదా, సుధీర్ రొమాంటిక్ మూడ్ లో ఉండగా, మరో ప్రక్క నాని కోపంతో రగిలిపోతున్నాడు. సాంగ్ నేపధ్యానికి తగ్గట్టుగా అమిత్ త్రివేది ట్యూన్ ఇవ్వగా శ్రేయా ఘోషల్ చక్కగా పాడారు. ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించారు. వి మూవీకి మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు నిర్మిస్తున్నారు.

లిరికల్ సాంగ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version