‘బింబిసార 2’ చేయకపోవడంపై దర్శకుడు క్లారిటీ!

‘బింబిసార 2’ చేయకపోవడంపై దర్శకుడు క్లారిటీ!

Published on Jul 18, 2025 7:05 AM IST

Bimbisara 2

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో సోషియో ఫాంటసీ చిత్రం బింబిసార కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ సినిమాకి సీక్వెల్ కూడా ఉంది. అయితే ఈ సీక్వెల్ సినిమాని మాత్రం వశిష్ఠ తెరకెక్కించడం లేదు.

దీనితో పార్ట్ 2 కి దర్శకుని పేరు మారడంపై తాను క్లారిటీ ఇచ్చాడు. పార్ట్ 2 ని అనీల్ పదురీ తెరకెక్కిస్తుండగా ఆ సినిమాకి తనకంటే అనీల్ బెటర్ అని అతనే బెటర్ గా మంచి ఐడియా క్రాక్ చేసాడు కాబట్టి నాతో పాటు కళ్యాణ్ రామ్ కూడా అతనే బెస్ట్ అని ఫిక్స్ అయ్యామని తెలిపారు. సో బింబిసార 2 కి దర్శకుడు అలా మారడం జరిగిందట. ఇక ఈ అవైటెడ్ సీక్వెల్ అతి త్వరలోనే మొదలు కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు