హీరో శర్వానంద్ నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అయితే, ఈ చిత్ర రిలీజ్ డేట్ మాత్రం మేకర్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఓటీటీ డీల్ కుదరకపోవడంతో ఈ చిత్ర రిలీజ్ ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘సామజవరగమనా’ చిత్ర దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇప్పటికే సంక్రాంతి సీజన్‌లో బోలెడు సినిమాలు రిలీజ్‌కు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, ప్రభాస్ ‘ది రాజా సాబ్’, రవితేజ RT76 చిత్రాలతో పాటు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి రానున్నాయి.
మరి ఇన్ని సినిమాల మధ్య శర్వానంద్ కూడా తన సినిమాతో రిలీజ్‌కు వస్తాడా..? ఈ రిస్క్ తీసుకునేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.