హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘వన్ వే టికెట్’ పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ. పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. కుష్బూ చౌదరి హీరోయిన్గా నటించనున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిర్మాతలు సి. కళ్యాణ్, హర్షిత్ రెడ్డి, త్రినాధరావు నక్కిన, టీ ఎస్ రావు, జగన్నాథ్ హాజరయ్యారు. సి. కళ్యాణ్ క్లాప్ కొట్టగా, హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. త్రినాధరావు నక్కిన కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
దర్శకుడు పళని స్వామి మాట్లాడుతూ, ‘‘వన్ వే టికెట్’ క్రైమ్, థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మంచి స్క్రిప్ట్‌తో వస్తోంది’’ అన్నారు. వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, ‘‘ఈ కథ నాకు చాలా నచ్చింది. ఇందులో నేను కొత్త పాత్రలో కనిపిస్తాను. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. నిర్మాత శ్రీనివాసరావు, హీరోయిన్ కుష్బూ చౌదరి కూడా చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.