టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “తమ్ముడు” కోసం అందరికీ తెలిసిందే. ఈ చిత్రంతో అయినా నితిన్ మంచి కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే అది ఈసారి కూడా జరగలేదు. ఇక ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా సీనియర్ నటి లయ ఈ సినిమాతోనే రీఎంట్రీ ఇచ్చారు.
అయితే ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి డేట్ ని ఫిక్స్ చేసేసుకుంది. ఈ చిత్రం హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఈ ఆగష్టు 1 నుంచి సినిమా అందుబాటులో ఉందనున్నట్టుగా అనౌన్స్ చేసేసారు.
తెలుగు సహా తమిళ్, ఇంకా కన్నడ, మళయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనున్నట్టు తెలిపారు. ఇక ఈ చిత్రానికి ఆజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ ఫీమేల్ లీడ్ లో నటించారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించారు.