అరుణగిరి ఆర్ట్స్, కౌండిన్య ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న “ఫైటర్ శివ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు సంపత్ నంది విడుదల చేశారు.
ఈ చిత్రానికి ప్రభాస్ నిమ్మల దర్శకత్వం వహించగా, మణికంఠ హీరోగా, ఐరా బన్సాల్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, సునీల్, వికాస్ వశిష్ట ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మధుసూదన్, యోగి కాట్రి, దిల్ రమేష్, లక్ష్మణ్, అభయ్, ఆనంద్ భారతి, ఘర్షణ శ్రీనివాస్, మాస్టర్ శన్విత్ నిమ్మల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
“ఫైటర్ శివ” యాక్షన్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు.