యూఎస్ లో ‘కూలీ’ సెన్సేషన్.. అప్పుడే హాఫ్ మిలియన్

coolie

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ యాక్షన్ చిత్రం “కూలీ” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగరాజ్ పాన్ ఇండియా లెవెల్లో భారీ తారాగణంతో తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి హైప్ ఉంది. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ అంచనాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే యూఎస్ మార్కెట్ బుకింగ్స్ లో కనిపిస్తున్నాయి.

యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రం బుకింగ్స్ మొదలైనప్పుడే గట్టి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇంకా సినిమాకి సగం నెలకి పైగా సమయం ఉన్నప్పటికీ హాఫ్ మిలియన్ మార్క్ ని దాటేసింది. దీనితో కూలీపై హైప్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ ఆగస్ట్ 14న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Exit mobile version