సెన్సార్ పూర్తి చేసుకున్న “చమ్మక్ చల్లో”

సెన్సార్ పూర్తి చేసుకున్న “చమ్మక్ చల్లో”

Published on Dec 20, 2012 1:30 PM IST

Chammak-Challo
వరుణ్ సందేశ్ త్వరలో “చమ్మక్ చల్లో” అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్లో కనిపించనున్నారు. “మిస్సమ్మ”,”విరోధి” వంటి చిత్రాలనే ఇప్పటి వరకు తెరకెక్కించిన నీలకంఠ మొదటి సారిగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. సంచిత పదుకొనే మరియు కేథరిన్ థెరెస ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ మంజూరు చేశారు. సాయాజీ షిండే, బ్రహ్మాజీ, శ్రీనివాస్ అవసరాల, చిన్మయి ఘట్రాజు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. కిరణ్ వారణాసి సంగీతం అందించగా ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ “ప్రియతమ నీవచట కుశలమా” మరియు “అమ్మాయి మాస్ – అబ్బాయి క్లాసు” అనే మరో రెండు చిత్రాలలో నటిస్తున్నారు

తాజా వార్తలు