సమీక్ష: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ – ఆకట్టుకోని రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్

సమీక్ష: వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ – ఆకట్టుకోని రివెంజ్ క్రైమ్ థ్రిల్లర్

Published on Oct 11, 2025 3:05 AM IST

Constable Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 10, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్
దర్శకుడు : ఆర్యన్ సుభాన్ ఎస్ కే
నిర్మాత : బలగం జగదీష్
సంగీత దర్శకుడు : సుభాష్ ఆనంద్, గ్యాని
సినిమాటోగ్రాఫర్ : షైక్ హజారా
ఎడిటర్ : శ్రీవర

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి పలు సినిమాలు వస్తే వాటిలో నటుడు వరుణ్ సందేశ్ నటించిన చిత్రం “కానిస్టేబుల్” కూడా ఒకటి. ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

మోకిలా మండలం, శంకరపల్లి అనే చిన్న గ్రామంలో ఆకస్మికంగా కొన్ని హత్యలు వరుసగా అతి దారుణంగా జరుగుతూ ఉంటాయి. ఆడ మగ అని తేడా లేకుండా జరుగుతున్న ఈ హత్యలు పోలీసులకి కూడా పెద్ద సవాలుగా మారుతాయి. అయితే ఈ ఊరి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబులే కాశీ (వరుణ్ సందేశ్). అయితే ఈ హత్యలు తన మేనకోడలు కీర్తి (నిత్యశ్రీ) వరకు కూడా వస్తాయి. ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన కాశీ ఎవరిని అయితే నిందితులు అనుకుంటారో వాళ్ళు కూడా చంపబడతారు. మరి అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు? ఎందుకు చేస్తున్నారు? అందుకు గల కారణం ఏంటి? చివరికి కాశీ వారిని పట్టుకున్నాడా లేదా అనేది ఇందులోని అసలు కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో ఉన్న మెయిన్ పాయింట్ ఓకే అని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో వస్తున్న రొటీన్ మర్డర్ క్రైమ్ థ్రిల్లర్స్ కి కొంచెం భిన్నంగా ట్రై చేశారు. దానికి అనుగుణంగా సాగే కొన్ని సన్నివేశాలు పర్వాలేదు అనిపిస్తాయి. కొంతమేర వరకు మైంటైన్ చేసిన సస్పెన్స్ ఫ్యాక్టర్ బాగుంది. అలాగే కొన్ని ట్విస్ట్ లు కూడా పర్వాలేదు.

ఇక హీరో వరుణ్ సందేశ్ ఓకే రేంజ్ పెర్ఫామెన్స్ ని అందించాడు అని చెప్పవచ్చు. కానీ యాక్షన్ పార్ట్ మాత్రం తన వరకు బాగుంది. నాచురల్ గా ఆ బ్లాక్స్ ఉంటే అందులో వరుణ్ సందేశ్ బాగా కనిపించాడు. ఇక తనతో పాటుగా హీరోయిన్ మధులిక సినిమాలో బాగుంది. కానీ వీరితో పాటుగా సెకండాఫ్ లో యువ నటి భవ్యశ్రీ సాలిడ్ పెర్ఫామెన్స్ ని చూపించింది. తన రోల్ ని షేడ్స్ అన్నిటినీ ఆమె చక్కగా ఎస్టాబ్లిష్ చేసి తన రోల్ కి ప్రాణం పోసింది. ఇక తన తండ్రిగా దువ్వాసి మోహన్ కూడా తన రోల్ తో మెప్పిస్తారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో ఒక డీసెంట్ సందేశంతో కూడిన లైన్ ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్ ఇచ్చే రీతిలో ప్లాన్ చేశారు కానీ దీనిని ఇంకా బెటర్ గా వాతావరణం క్రియేట్ చేసి ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. కేవలం కొన్ని సీన్స్ వరకు తప్పితే ఈ సినిమాలో అనవసర సన్నివేశాలు ఉన్నాయి.

ఫస్టాఫ్ లో అసలు ఆ ఐటెం సాంగ్ ఎందుకో అర్ధం కాదు ఆ సాంగ్ లో కనిపించిన నటి కూడా అందుకు సూట్ కాలేదు. అలాగే హీరోయిన్ రోల్ కూడా పెద్దగా ఏమీ లేదు ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు తప్పితే తనకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. వీరితో పాటుగా వరుణ్ సందేశ్ ఇంకా బెటర్ గా పెర్ఫామ్ చేయాల్సింది.

ఇంకా కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా కనిపిస్తాయి. ఒక మూగవాన్ని అనుమానంతో పట్టుకుంటాడు శుభ్రంగా కొడతాడు కూడా కానీ కనీసం అతనికి ఎవరు ఆ మాస్క్ ఇచ్చారు అనే దాన్ని ఓ సైన్ లాంగ్వేజ్ తెలిసినవారితో చెప్పించుకొని స్కెచ్ ని కూడా గీయించుకోలేకపోయారా? అనిపిస్తుంది.

అంతే కాకుండా కాశీ చిమ్మ చీకట్లో ఓ చెరువులో దూకేసి ఓ గొలుసు కనిపెట్టేస్తాడు. ఇలా కొన్ని కొన్ని సన్నివేశాలు మాత్రం చాలా సిల్లీగా ఉన్న ఆసక్తిని తగ్గించేలా చేస్తాయి. వీటితో పాటుగా కథనం చాలా వరకు ఊహాజనితంగానే సాగుతుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి. సంగీతం కొన్ని సన్నివేశాల్లో బాగుంది కానీ ఆ మూమెంటం ఆద్యంతం కొనసాగి ఉంటే ఇంకా బెటర్ గా అనిపించి ఉండేది. కెమెరా వర్క్ బానే ఉంది. ఎడిటింగ్ లో ఆ ఐటెం సాంగ్ తీసేయాల్సింది.

ఇక దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్ కే విషయానికి వస్తే.. తన వర్క్ పూర్తి స్థాయిలో మెప్పించలేదు అని చెప్పాలి. మంచి సందేశంతో కూడిన మంచి లైన్ తన దగ్గర ఉంది కానీ దానిని పూర్తి స్థాయిలో గ్రిప్పింగ్ గా మలచలేదు. సెటప్ ని ఇంకా నాచురల్ గా డిజైన్ చేసుకొని టెక్నికల్ గా కూడా సినిమాని స్ట్రాంగ్ గా తెరకెక్కించాల్సింది. దీనితో మంచి అవకాశం వృథా చేసుకున్నట్టు అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘కానిస్టేబుల్’ చిత్రంలో మెప్పించే అంశాలు కంటే నొప్పించే అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి. రివెంజ్ పాయింట్ అందులోని ఎమోషన్ అర్ధవంతగానే అనిపిస్తుంది కానీ దాని చుట్టూ అల్లుకున్న కథనం మాత్రం అంత ఇంప్రెసివ్ గా అనిపించదు. దీనితో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు