వైజాగ్ ఘటనపై విచారం వ్యక్తం చేసిన నాని, వరుణ్

వైజాగ్ సంఘటన పలువురు దిగ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎల్ జి పాలిమర్స్ ఫ్యాక్టరీ నుండి వెలువడిని విషవాయువు కారణంగా పరిసర ప్రాంతాల్లోకి ప్రజలు, జంతువులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వేకువ జామునే జరిగిన ఈ దురదృష్ట సంఘటన వైజాగ్ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఇక సంఘట పట్ల పలువురు ప్రముఖులు విచారం ప్రకటించారు.

హీరో నాని పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతున్నాయి. నిస్సహాయులమైపోయాం. ప్రార్ధించడం తప్ప మనం ఏమి చేయలేము అని అన్నారు. వరుణ్ తేజ్ వైజాగ్ సంఘటన కలచి వేసిందని, చనిపోయిన వవారి కుటుంబాలకు నా సంతాంపం అన్నారు. అలాగే అస్వస్థకు గురైన వారు త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. పరిశ్రమలు పునఃప్రారంభ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు.

Exit mobile version