వర్మ థ్రిల్లర్ ట్రైలర్ అంతగా థ్రిల్ చేయలేదు.

వర్మ థ్రిల్లర్ ట్రైలర్ అంతగా థ్రిల్ చేయలేదు.

Published on Jul 30, 2020 10:02 PM IST

వరుసగా సినిమాలు చేస్తున్న వర్మ నేడు మరో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. థ్రిల్లర్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదల కాగా ఏమాత్రం సినిమాపై ఆసక్తి కలిగించలేకపోయింది. వర్మ గత రెండు డిజిటల్ రిలీజ్ చిత్రాలైన క్లైమాక్స్, నగ్నం మిక్స్ చేస్తే థ్రిల్లర్ అన్నట్లుగా ఉంది. ఇక ట్రైలర్ లో వర్మ నగ్నం మూవీ బీజీఎమ్ వాడడం విశేషం. ఎదో విధంగా మూవీకి మంచి ప్రచారం తెచ్చుకొనే వర్మ ఈ సారి ఫెయిల్ అయినట్లు అనిపిస్తుంది.

థ్రిల్లర్ వర్కింగ్ స్టిల్స్ తో కాకరేపిన వర్మ ట్రైలర్ విషయంలో మాత్రం నిరాశ పరిచాడు. ఇప్పటికే వర్మ సినిమాలలో ట్రైలర్ కి మించి కొత్తగా ఏమి ఉండడం లేదని ప్రచారం జరుగుతుండగా, కనీస ఆసక్తి లేకుండా సాగిన ఈ ట్రైలర్ నిరాశపరిచింది. అప్సర రాణి గ్లామర్ తప్పితే ఈ మూవీలో భయపెట్టే హారర్ లేదా థ్రిల్స్ ఉండకపోవచ్చు

తాజా వార్తలు