నాగ్ ‘శివ’ మూవీలో డైరెక్టర్ పూరిని చూశారా?


డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన డెబ్యూ మూవీ శివ లో నటించిన డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫోటో పంచుకున్నారు. ఓ షాట్ లో సీరియస్ గా ఉన్న నాగార్జున వెనుక జులపాలు పెంచుకొని, టక్ చేసుకొని బక్క పలుచగా ఉన్న పూరి యంగ్ లుక్ ఆసక్తికరంగా ఉంది. శివ సినిమాలో ఓ చిన్న షాట్ లో పూరి నటించినట్లు తెలుస్తుంది. దర్శకుడు పూరి, రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. పూరి హీరోలలో కనిపించే డైనమిజం, తెగింపు వర్మ నుండి నేర్చుకున్నవే.

వర్మ స్కూల్ నుండి వచ్చిన అందరు దర్శకుల సినిమాలు డిఫరెంట్ గా మరియు బోల్డ్ కాన్సెప్ట్ కలిగి ఉంటాయి. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఎదిగిన పూరి జగన్నాధ్ గత ఏడాది ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఓ సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండ హీరోగా ఓ భారీ చిత్రం చేస్తున్నారు. పూరి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల కానుంది.

Exit mobile version