బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన రీసెంట్ స్పై యూనివర్స్ మూవీ ‘వార్ 2’ మేకర్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ చేస్తుందని చిత్ర యూనిట్ భావించింది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించారు. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత కథ అడ్డం తిరిగింది.
ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఈ చిత్రం డిజాస్టర్‌గా మారనుంది. అయితే, ఈ సినిమాపై యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ సాలిడ్ అంచనాలు పెట్టుకుంది. కానీ, వారి ఆశలపై ప్రేక్షకులు నీళ్లు చల్లారు. అయితే, తమ సినిమాలోని లోపాలను గుర్తించి రాబోయే ప్రాజెక్టులలో ఇలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారట నిర్మాతలు.
దీనికోసం తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ఆల్ఫా’పై వారు ఫోకస్ పెంచారట. స్టార్ బ్యూటీ ఆలియా భట్ లీడ్ రోల్ ప్లే చేస్తున్న ‘ఆల్ఫా’ చిత్రం ఇప్పటికే మెజారిటీ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో మరో బ్యూటీ శార్వరి కూడా నటిస్తుంది. అయితే, ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఏమైనా లోపాలు ఉన్నాయా అని టీమ్ జాగ్రత్తగా చూస్తుందట. ఏమైనా తప్పులు ఉంటే వాటిని రీషూట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మొత్తానికి ‘ఆల్ఫా’పై వార్ 2 ఎఫెక్ట్ గట్టిగానే పడిందని బి టౌన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.