పవర్ స్టార్ సిరీస్ లో మరో రెండు చిత్రాలు?

పవర్ స్టార్ మూవీని ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో ఎంత మంది చూశారు అనేది ఎవరికీ తెలియదు. వర్మ మాత్రం ఆ లెక్కలు చెవితే కొందరిగుండెలు మిగిలిపోతాయి అన్నారు. ఆయన లెక్కల ప్రకారం పవర్ స్టార్ మూవీకి ఊహించిన దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది అంటున్నారు. పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. నిజంగా ఆ సినిమాను జనాలు ఏస్థాయిలో చూశారా లేదా అనేది వర్మకే తెలియాలి. కాగా నేడు వర్మ పవర్ స్టార్ సిరీస్ లో మరో రెండు చిత్రాలు ఉంటాయనికి చెప్పడం సంచలనంగా మారింది.

ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ పవర్ స్టార్ మూవీ మొత్తం మూడు భాగాలు అని, అందులో ఒక భాగం వచ్చింది. మరో రెండు భాగాలు భవిష్యత్తులో విడుదల చేస్తాను అన్నారు. ఇప్పటికే పవర్ స్టార్ మూవీతో పెద్ద రచ్చ చేసిన వర్మ, మరో రెండు సినిమాలు అనడం మరింత చర్చకు దారితీసింది. ఇక ప్రస్తుతం వర్మ థ్రిల్లర్ అనే మూవీపై వర్క్ చేస్తున్నారు. త్వరలో ఆర్ జి వి వరల్డ్ థియేటర్ లో ఈ మూవీ విడుదల కానుంది.

Exit mobile version