బన్నీ డైరెక్టర్ రవి తేజ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట

కథా రచయితగా మంచి పేరున్న వక్కంతం వంశీ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నాపేరు సూర్య సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఐతే బన్నీ క్యారక్టరైజేషన్ పరంగా ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా విడుదలై చాల కాలం అవుతున్నా వక్కతం వంశీకి మరో మూవీ డైరెక్ట్ చేసే అవకాశం రాలేదు. కాగా ఈ స్టార్ రైటర్ మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.

ఆయన చెప్పిన స్టోరీ లైన్ రవితేజకు నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. రవితేజ ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న వంశీ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి దర్శకుడిగా సెటిల్ అవ్వాలని చూస్తున్నారని సమాచారం. ఇక ప్రస్తుతం రవితేజ గోపి చంద్ మలినేని తెరకెక్కిస్తున్న క్రాక్ మూవీలో నటిస్తున్నారు.

Exit mobile version