ఇక “వకీల్ సాబ్” నుంచి రెగ్యులర్ అప్డేట్స్ తో మోతే..!

ఇక “వకీల్ సాబ్” నుంచి రెగ్యులర్ అప్డేట్స్ తో మోతే..!

Published on Feb 17, 2021 7:01 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వకీల్ సాబ్” అనే చిత్రం విడుదలకు సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం తాలూకా షూట్ కూడా కొన్నాళ్ల కితమే పూర్తయ్యిపోయింది. కానీ అప్డేట్స్ లో మాత్రం మేకర్స్ ఎక్కడా వేగం కనబర్చలేదు.

ఇప్పుడు అందుకు బ్రేక్ ఇచ్చి అప్డేట్ లతో మోత మోగించడానికి రెడి అవుతున్నట్టుగా ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ అంటున్నాడు. పాటల షెడ్యూల్ మొదయ్యింది అని ఇక నుంచి అప్డేట్స్ కూడా వరుసపెట్టి వస్తాయని క్లారిటీ ఇచ్చేసాడు. దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా పై ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించగా వచ్చే ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు ఈ రెడీగా ఉంది..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు