“వకీల్ సాబ్” కూడా ల్యాండ్ అవ్వనున్నాడా.?

“వకీల్ సాబ్” కూడా ల్యాండ్ అవ్వనున్నాడా.?

Published on Oct 6, 2020 4:02 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం “పింక్”కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నాడు. అయితే చాలా కాలం నుంచి పవన్ నుంచి రానున్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ మధ్య కాలంలోనే భారీ ఓటిటి ఆఫర్స్ వచ్చినప్పటికీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా థియేట్రికల్ రిలీజ్ కే స్టిక్ అయ్యి నిలబడ్డారు. ఇంకా కొంత భాగం మాత్రమే షూటింగ్ మిగిలి ఉన్న ఈ చిత్రానికి సంబంధించి షూట్ కూడా ఇటీవలే మొదలయ్యింది.

అయితే మొదట పవన్ పై లేని షాట్స్ తో చిత్ర యూనిట్ మొదలు పెట్టారు. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ ఇంకా తొందరగానే మొదలు పెట్టనున్నారని టాక్ తో పాటుగా టీజర్ తో వకీల్ సాబ్ గా కూడా తొందరలోనే ల్యాండ్ అవ్వనున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

ఈ టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో “అజ్ఞ్యాతవాసి” తర్వాత వచ్చేది ఈ టీజర్ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ టీజర్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

తాజా వార్తలు