ఉయ్యాలా జంపాలాకి సూపర్బ్ క్రేజ్

Uyyala_Jampala
మాములుగా తెలుగు ప్రేక్షకులు స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలను, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్న సినిమాలను చూడటానికి ఇష్టపడతారు. అలాగే అప్పుడప్పుడు కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకుంటాయి. అలా చాలా చిన్నబడ్జెట్ తో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్ర నిర్మాతలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రముఖులకు ప్రత్యేకంగా షోస్ వేయగా వారంతా సినిమా చాలా బాగుందని పాజిటివ్ రిపోర్ట్స్ చెప్తున్నారు.

ఎంఆర్ సన్నీ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో సాంగ్స్ కూడా చాలా బాగుండడంతో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బాగా ఫేమస్ అయిన అవిక గోర్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. రాజ్ తరుణ్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాని విరించి వర్మ డైరెక్టర్. డి సురేష్ బాబు సమర్పణలో సన్ షైన్ సినిమాస్ – అన్నపూర్ణ స్టూడియోస్ వారు కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

Exit mobile version