‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో తెలుగు వారికి హీరోయిన్ గా పరిచయమైన అవికా గోర్ మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. దీనికంటే ముందు అవికా గోర్ ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో ఆంధ్రప్రదేశ్ లో మంచి గుర్తింపు వచ్చింది. కానీ ‘ఉయ్యాలా జంపాలా’తో సినీ ప్రేమికుల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది.
తన రెండవ సినిమాని రైటర్ ఎన్.రవి డైరెక్టర్ పరిచయం కానున్న ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసింది. జర్నలిస్ట్ అయిన గిరిధర్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు. మీడియం బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం అవికా గోర్ రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కాకుండా కాస్త డిఫరెంట్ కథలను ఎంచుకుంటోంది.