ఫుల్ స్వింగ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ప్రస్తుతం ఈ పనుల్లో

Ustaad-Bhagat-Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ చాలా కాలం తర్వాత షూటింగ్ లో ఫుల్ బిజీ గా కనిపిస్తున్నారు. ఇటీవల ఓజి కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. రీసెంట్ గానే క్లైమాక్స్ సహా ఓ సాంగ్ షూట్ చేసుకున్న మేకర్స్ ఇప్పుడు మరో వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. దీనితో ఉస్తాద్ ఎడిటింగ్ పనులు షురూ అయ్యాయట. ఇలా అన్ని పనులు శరవేగంగా కంప్లీట్ అవుతున్నాయని చెప్పాలి.

ఇక ఈ సినిమా ఈ ఏడాదిలోనే అన్ని పనులు ముగించుకోనుండగా వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version