మన సినిమాలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు

మన సినిమాలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఓవర్సీస్ ప్రేక్షకులు

Published on Jan 14, 2020 1:12 PM IST

కొన్నాళ్ళుగా నిదానంగా సాగిన యూఎస్ మార్కెట్ ఈ సంక్రాంతి పుణ్యమా అని ఊపదుకుంది. వరుసగా విడుదలైన ‘దర్బార్, సరిలేర నెకెవ్వరు, అల వైకుంఠపురములో’ సినిమాలు అక్కడి సినిమా ప్రేమికుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి సినిమా అంచనలని అందుకునేలా ఉండటంతో ప్రేక్షకులు కూడా వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు.

తొలుత విడుదలైన రజనీ యొక్క ‘దర్బార్’ చిత్రం 1.5 మిలియన్ డాలర్ మార్కును చేరుకోగా మహేష్ బాబు యొక్క ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నిన్నటికే 1.7 మిలియన్ డాలర్ మార్కును చేరుకుంది. ఇక అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ కూడా 1.5 మిలియన్ మార్క్ టచ్ చేసింది. మొత్తం మీద మూడు సినిమాల మీద మన యూఎస్ ఆడియన్స్ 5 మిలియన్ల వరకు ఖర్చు చేసి మన హీరోలకు, అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు మంచి ఉత్సాహానిచ్చారు.

తాజా వార్తలు