ఆగని “సంక్రాంతికి వస్తున్నాం”.. లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే!

ఆగని “సంక్రాంతికి వస్తున్నాం”.. లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే!

Published on Jan 23, 2025 2:00 PM IST

ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు భారీ వసూళ్లతో వరల్డ్ వైడ్ గా అదరగొడుతుంది. ఒక్క వెంకీ మామ కెరీర్ లోనే కాకుండా మన తెలుగు సంక్రాంతి బరిలో వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ లిస్ట్ లో చేరి అదరగొట్టింది.

అయితే మొత్తం 11 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆల్రెడీ 218 కోట్ల గ్రాస్ ని దాటిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు మొత్తం 9 రోజుల్లో సాలిడ్ మార్క్ 230 కోట్ల గ్రాస్ ని దాటినట్టుగా పిఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది అని చెప్పాలి. ఇక ఈ వారాంతంలో మళ్ళీ డెఫినెట్ గా సినిమా మరింత ఊపందుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు – శిరీష్ లు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు