పండుగ లేదు పబ్బం లేదు.. ఫ్యామిలీ సినిమా అంటే ఆ క్రేజే వేరు..!

పండుగ లేదు పబ్బం లేదు.. ఫ్యామిలీ సినిమా అంటే ఆ క్రేజే వేరు..!

Published on Aug 30, 2025 2:00 AM IST

Venkatesh-Sankranthi

ఓటిటి కాలంలో టెలివిజన్ ప్రభావం తగ్గినా, శాటిలైట్ ఛానల్స్ మాత్రం దర్శకులకు పాఠాలు చెబుతూనే ఉంటాయి. ఇప్పటికీ కోట్లాది మధ్యతరగతి కుటుంబాలకు కేబుల్ కనెక్షన్ ప్రధాన వినోదం. అందుకే నిర్మాతలకు ఇది మరో ఆదాయ వనరుగా నిలుస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భారీ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాలు కూడా బుల్లితెరపై పెద్ద టిఆర్పీ సాధించడం లేదు. ఈ కోవలో ‘పుష్ప 2’ లాంటి హైప్ సినిమా కూడా అల వైకుంఠపురములో, టెంపర్, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాల స్థాయిని అందుకోలేకపోయింది.

అయితే అదే సమయంలో, పాత సినిమాల మ్యాజిక్ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల జెమిని ఛానల్‌లో ప్రసారమైన వెంకటేష్‌ ‘సంక్రాంతి’ చిత్రం మరోసారి టిఆర్పీ పరంగా దుమ్మురేపింది. ఎన్ని వందల సార్లు టెలికాస్ట్ అయినా, ప్రేక్షకులు ఇదే ఆసక్తితో చూసి 6.08 రేటింగ్ ఇచ్చారు. ఇతర ఛానల్స్‌లో వచ్చిన నాగచైతన్య తండేల్ (5.08), సిద్దు జొన్నలగడ్డ జాక్ (4.45) కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు గ్రామాలు, పట్టణాల్లో విపరీతమైన ఆదరణ లభించిందని తెలుస్తోంది.

2005లో విడుదలైన సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెంకటేష్‌కి ఉన్న బలమైన ఫ్యామిలీ ఫాలోయింగ్, గట్టి సెంటిమెంట్, ఎమోషనల్ టచ్, ఎస్.ఏ. రాజ్‌కుమార్ సంగీతం అన్నీ కలగలిసి ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ చేయడంతో పాటు రిపీట్ విలువను పెంచాయి. ఈ కాలంలో హీరోయిజం, యాక్షన్, డార్క్ స్టోరీస్‌తో నిండిపోయిన సినిమాల మధ్యలో కూడా ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి ఎంత డిమాండ్ ఉందో సంక్రాంతి మరోసారి రుజువు చేసింది.

తాజా వార్తలు