ఐకాన్ స్టార్ డ్యాన్స్‌కు సెట్స్‌లో గూస్‌బంప్స్.. ఏం చేశారంటే..?

ఐకాన్ స్టార్ డ్యాన్స్‌కు సెట్స్‌లో గూస్‌బంప్స్.. ఏం చేశారంటే..?

Published on Aug 30, 2025 1:00 AM IST

AA22xA6

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో ఓ భారీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని AA22 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర గురించి సినీ సర్కిల్స్‌లో రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది.

అయితే, తాజాగా ఈ చిత్ర సెట్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయినట్లు తెలుస్తోంది. ఓ డ్యాన్స్ సీక్వెన్స్‌లో బన్నీ అదరగొట్టడంతో ఆయన చేసని డ్యాన్స్‌కు సెట్స్‌లో అందరికీ గూస్‌బంప్స్ వచ్చాయట. దీంతో అక్కడున్న వారందరూ చప్పట్లు కొడుతూ బన్నీని అభినందించినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక ఈ సినిమాను అట్లీ తనదైన స్టయిల్‌లో రూపొందిస్తున్నారని.. ఈ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో ఐకాన్ స్టార్ పేరు మార్మోగడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు