టాలీవుడ్ లో 20 సంవత్సరాల తర్వాత రానున్న ప్రతిష్టాత్మక మల్టీ స్టారర్ చిత్రం ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమా టికెట్స్ కి భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా టికెట్లకి తక్కువ సప్లై ఉంది.
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాలో వీరిద్దరికీ తల్లితండ్రులుగా ప్రకాష్ రాజ్, జయసుధ కనిపించనున్నారు. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాకి శ్రీ కాంత్ అడ్డాల డైరెక్టర్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.