మన తెలుగు సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ రన్ సొంతం చేసుకునే సీజన్ లో సమ్మర్ సీజన్ కూడా ఒకటి. మరి గత కొన్నాళ్ల నుంచి ఈ సమ్మర్ సీజన్ లో సరైన సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోయాయి. అయితే ఈసారి సమ్మర్ సీజన్ కూడా ఇదే రీతిలో అనే కంటే కొంచెం కొన్ని కొన్ని సినిమాలు మాత్రమే అలరించాయి.
మెయిన్ గా భారీ సినిమాలు ఈ రేస్ లో మిస్ అవ్వడం గమనార్హం. కానీ ఇపుడు ఊహించని విధంగా ప్లాన్ చేసుకోని సమ్మర్ బాక్సాఫీస్ వార్ సిద్ధం అయ్యింది. సమ్మర్ ముగింపు అలాగే వానా కాలం మొదలయ్యే సమయంలో ఒక నెల వ్యవధిలో మొత్తం 5 భారీ సినిమాలు తెలుగు సహా పాన్ ఇండియా ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చేస్తున్నాయి.
జూన్ మొదటి వారంలోనే చూసుకున్నట్టైతే కమల్ హాసన్, మణిరత్నంల అవైటెడ్ చిత్రం “థగ్ లైఫ్” కూడా ఒకటి. ఈ చిత్రం జూన్ 5న విడుదల అవుతుంది. ఇక అదే నెల తర్వాతి వారం లోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” జూన్ 12న విడుదల కానున్నట్టుగా లేటెస్ట్ గానే అనౌన్స్ చేశారు. ఇక వీటితో పాటుగా జూన్ 20న ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల అవైటెడ్ చిత్రం “కుబేర” సిద్ధంగా ఉంది.
ఇక ఈ వారం తర్వాత మంచు విష్ణు భారీ చిత్రం “కన్నప్ప” జూన్ 20న రాబోతుండగా ఫైనల్ గా జూలై 4న విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి భారీ సినిమా “కింగ్డమ్” రాబోతుంది. ఇలా పలు ఊహించని మార్పులు చేర్పులతో ప్లాన్ చెయ్యని సమ్మర్ ట్రీట్ ఆడియెన్స్ కోసం సిద్ధంగా ఉందని చెప్పాలి.