రొటీన్ లవ్ స్టొరీ పాటలకు వెరైటి ప్రమోషన్

రొటీన్ లవ్ స్టొరీ పాటలకు వెరైటి ప్రమోషన్

Published on Oct 15, 2012 8:15 PM IST


సందీప్ కిషన్ మరియు రెజినా ప్రధాన పాత్రలలో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రొటీన్ లవ్ స్టొరీ” ఆడియో ప్రమోషన్ ని నిర్మాతలు విభిన్నంగా చేస్తున్నారు. ఈ చిత్ర విడుదలకు ముందే రోజుకొక పాట చొప్పున టీవి మరియు రేడియోలలో విడుదల చేస్తున్నారు. ఇది ఈ చిత్ర పాటల మీద ఆసక్తిని వారం రోజుల పాటు కొనసాగేలా చేస్తుంది. మిక్కి జే మేయర్ అందించిన సంగీతం చాలా బాగున్నట్టు తెలుస్తుంది. మిక్కి అభిమానులకు ఈ పాటలు వీనులవిందు కానుంది. గతంలో “ఎల్బిడబల్యు” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చాణక్య బునేటి ఈ చిత్రాన్ని నిర్మించగా సురేష్ భార్గవ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం నవంబర్లో విడుదల కానుంది.

తాజా వార్తలు