ఓ చిన్న సినిమా కోసం సరికొత్తగా డిజైన్ చేసిన ఓ సరికొత్త పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ టాక్ అఫ్ ది టౌన్ గా మారడమే కాకుండా పలువురి సెలబ్రిటీస్ మాట్లాడుకునే రేంజ్ కి వెళ్ళింది. బాగా ఫేమస్ అయిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కూడా ఈ పోస్టర్ ని ట్వీట్ చేసాడు. ఈ సినిమా పేరు ‘సూపర్ స్టార్ కిడ్నాప్’.
ఈ పోస్టర్ పై ముగ్గురు యువకులు మహేష్ బాబు మాస్క్ ధరించి ఉండడమే కాకుండా చేతిలో కత్తి ఉంటుంది. ఆదర్శ్ ప్రాధాన్ పాత్రలో నటించిన ఈ మూవీ క్రైమ్ కామెడీగా ఉంటుందని అంటున్నారు. నందు, భూపాల్, పూనం కౌర్, తేజశ్విని మదివాడ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి చందు నిర్మించగా సాయి కార్తీక్ మ్యూజిక్ అందించాడు.