చిరు షాకింగ్ లుక్ వెనుక ఊహించని ప్లానింగ్?

చిరు షాకింగ్ లుక్ వెనుక ఊహించని ప్లానింగ్?

Published on Sep 11, 2020 3:42 PM IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ప్రాజెక్ట్ అనంతరం కూడా మరిన్ని ప్రాజెక్టులు చిరు లైన్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆచార్య షూట్ మళ్ళీ పునః ప్రారంభం అయ్యేందుకు రెడీ అవుతుంది అనుకునే సమయంలో ఆ సినిమా లుక్ తో సంబంధమే లేకుండా ఒక గుండు లుక్ లో దర్శనమిచ్చి షాకిచ్చారు మెగాస్టార్.

అయితే ఈ సరికొత్త లుక్ వెనుక పెద్ద సస్పెన్సే ఉన్నట్టు తెలుస్తుంది. చిరు ఆచార్య తర్వాత వేదాళం రీమేక్ లో కూడా నటించనున్నారు. అయితే ఆ సినిమా కోసం ఈ లుక్ ను సిద్ధం చేసారని అంతా అనుకుంటున్నారు. కానీ ఆ సినిమా కోసం కూడా ఈ లుక్ కాదని బజ్ వినిపిస్తుంది. దీనితో చిరు వేరే ప్లానింగ్ లో ఉన్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి చిరు వేసిన ఆ ప్లానింగ్ ఏమిటి అన్నదానిపై క్లారిటీ కావాలంటే కాలమే సమాధానం చెప్పాలి.

తాజా వార్తలు