మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ దాదాపు అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేసేసింది. అలాగే మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ హీరోల్లా హీరోయిన్స్ జాబితా ఉంటే అందులో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం కాజల్ పెళ్ళికి సంబంధించి అలా అనేక వార్తలు వినిపిస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
అలా అనేక రకాల స్పెక్యులేషన్స్ అనంతరం ఇటీవలే కాజల్ పెళ్ళికి ఒకే చెప్పడంతో ఈ అంశం మంచి హాట్ టాపిక్ అయ్యింది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ కిచ్లుతో కాజల్ పెళ్లి నిశ్చయం అయ్యిందన్న వార్తే ఆశ్చర్యకరం అంటే పెళ్లి డేట్ కూడా మరింత ఆశ్చర్యకరం అని చెప్పాలి.
పెళ్లి లాక్ డౌన్ తర్వాత ఉంటుంది అనుకుంటే పెళ్లి వార్త వచ్చిన ఇదే నెలలో పెళ్లి కూడా ఓకె అయ్యినట్టుగా కాజల్ తెలిపింది. ఇదే అక్టోబర్ నెలలోనే 30 వ తారీఖున ముంబైలో ఇద్దరి కుటుంబీకుల మధ్య చిన్న వేదికలో చేసుకోనున్నామని కాజల్ తెలిపారు. అలాగే వివాహ అనంతరం కూడా తాను తన పని చేస్తూ ఎంటర్టైన్ చేస్తానని మీ అందరి దీవెనలు ఎప్పటి లానే ఉండాలి అని కాజల్ తెలిపింది.
— Kajal Aggarwal (@MsKajalAggarwal) October 6, 2020