ఊహించని కలయికలు: తమిళ్ లెజెండ్ దర్శక హీరోలు తెలుగు యంగ్ స్టర్స్ తో?

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఇపుడు ఎలాంటి క్రేజీ కలయికలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. అయితే మెయిన్ సినీ పరిశ్రమలు తెలుగు,హింది మరియు తమిళ్ లు అందరు దర్శక హీరోలు షఫుల్ అవుతూ సాలిడ్ సినిమాలు చేస్తుండగా ఇపుడు రెండు క్రేజీ కాంబినేషన్స్ కోసం రూమర్స్ వినిపిస్తున్నాయి.

తమిళ్ లో లెజెండరీ హీరో అలాగే దర్శకులు సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే మణిరత్నంలు టాలీవుడ్ యంగ్ స్టర్స్ తో వర్క్ చేయనున్నట్టుగా ఇపుడు రూమర్స్ మొదలయ్యాయి. అయితే రజినీకాంత్ యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో సినిమా చేయనున్నారని ఇక మణిరత్నం అయితే టాలెంటెడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇవి కానీ నిజం అయితే మాత్రం ఊహించని కలయికలుగా మారతాయి అని చెప్పొచ్చు. మరి వీటిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

Exit mobile version