“ఉమా మహేశ్వరరావు” మీ ఇంటికే వస్తున్నాడు.!

“ఉమా మహేశ్వరరావు” మీ ఇంటికే వస్తున్నాడు.!

Published on Sep 4, 2020 7:02 AM IST

ఇప్పుడిపుడే హీరోలుగా నిలదొక్కుకుంటున్న యువ హీరోలలో మోస్ట్ అండర్ రేటెడ్ మరియు టాలెంటెడ్ హీరో సత్య దేవ్ కూడా ఒకరు. ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన ఈ హీరో నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య”. వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రంతో టాలీవుడ్ ఆడియెన్స్ కు సత్యదేవ్ మరింత దగ్గరయ్యాడు.

అయితే ఈ చిత్రం గత కొన్ని రోజుల కితం దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యి మంచి మన్ననలు పొందింది. అలాగే ఈ చిత్రం తనకు కూడా నచ్చింది అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా లేటెస్ట్ గా చెప్పడం మరో విశేషం. అయితే ఇప్పుడు ఉమా మహేశ్వరరావు నేరుగా మీ ఇంటికే వచ్చి పలకరించనున్నాడు.

ఈ చిత్రం తాలూకా సాటిలైట్ హక్కులను తెలుగు టాప్ ఛానెల్ ఈటీవీ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం ఒక లోకల్ ఛానెల్ వారు టెలికాస్ట్ చేసారని ఫైర్ అయ్యిన సంగతి తెలిసిందే. కానీ ఇపుడు ఏఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఈటీవీలో వచ్చే సెప్టెంబర్ 13 వ తారీఖు ఆదివారం సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్టు కన్ఫామ్ చేసారు. ఒకవేళ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో చూసే అవకాశం మీకు లేనట్టయితే ఖచ్చితంగా మిస్సవ్వద్దు.

తాజా వార్తలు