‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యంగ్ హీరో యశో సాగర్ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ రోడ్డు ప్రమాదం ఈ రోజు ఉదయం కర్ణాటకలోని సిరా అనే ప్రాంతంలో జరిగింది. ఈ హీరో తండ్రి స్వతహాగా కర్నాటక కి చెందిన వారు, అలాగే తన తల్లి గారు చిత్తూరుకి చెందిన వారు. అతని అసలు పేరు భరత్ జ్యోతిష్య పండితుల సలహా మేరకు సినిమాల కోసం తన పేరు యశో సాగర్ గా మార్చుకున్నాడు.
ఈ సందర్భంగా యశో సాగర్ కుటుంబ సభ్యులకు 123తెలుగు.కామ్ తరపున సంతాపాన్ని తెలియజేస్తున్నాం.