ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చిత్రీకరిస్తున్న సినిమా ‘ఉలవచారు బిరియాని’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. ఈ సినిమాని ప్రకాష్ రాజ్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు. ఈ సినిమా నిర్మాణపై ఆయన చాలా సంతోషంగా వున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో మార్చి రెండవ వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘సాల్ట్ ‘ఎన్’ పెప్పర్’ కి రీమేక్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, స్నేహ, సంయుక్త హోర్నాద్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రీత సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాని డ్యూయెట్ మూవీ బ్యానర్ పై ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నాడు. ఈ సంవత్సరం చివర్లో ఈ సినిమా తెలుగు తమిళ, కనడ భాషల్లో విడుదలకానుంది.