ఊ కొడతారా ఉలిక్కి పడతారా షూటింగ్ పూర్తి

ఊ కొడతారా ఉలిక్కి పడతారా షూటింగ్ పూర్తి

Published on May 19, 2012 10:44 PM IST


నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి నటిస్తున్న ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లోగోని హైదరాబాదులో ఘనంగా ఆవిష్కరించారు. ఈ చిత్ర ఆడియో కూడా ఈ నెల 18న విడుదల చేయాలని భావించినప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. త్వరలో భారీ వేడుక ఏర్పాటు చేసి ఆడియో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. సోనూ సూద్, దీక్షా సేథ్, పంచి బోరా, తమిళ నటుడు ప్రభు, భాను చందర్, సాయి కుమార్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు క్ష్మి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రానికి బోబో శశి సంగీతం అందిస్తున్నాడు. మంచు లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు