జూలై 27న రానున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా


మంచు మనోజ్ మరియు బాలకృష్ణ ప్రధాన పాత్రలలో వస్తున్న “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రం జూలై 27న విడుదలకు సిద్దమయ్యింది. గతంలో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2న విడుదల చెయ్యాలని అనుకున్నారు. ఈ చిత్ర నిర్మాత లక్ష్మి మంచు ఈ చిత్రాన్ని జూలై 27న విడుదల చెయ్యాలని నిర్ణయించుకుంది. లక్ష్మీ మంచు,దీక్షా సేథ్,సోనూ సూద్ మరియు సాయి కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.శేఖర్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బోబో శశి ఈ చిత్రానికి సంగీతం అందించగా ఈ చిత్రం పరిశ్రమలో మంచి టాక్ తో విడుదలవుతోంది. ఈ చిత్రానికి మంచు మనోజ్ మరియు నందమూరి బాలకృష్ణ ప్రధాన ఆకర్షణలు కానున్నారు.

Exit mobile version