మంచు మనోజ్ మరియు బాలకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రానికి పరిశ్రమలో సానుకూల స్పందన కనిపిస్తుంది. ఈ చిత్రం ఈ మధ్యనే పంపిణిదారులకి చిత్రాన్ని ప్రదర్శించిన తరువాత ఈ చిత్రం గురించి మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. ఈ చిత్రంలో రెండవ అర్ధ భాగం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. బాలకృష్ణ మరియు మంచు మనోజ్ అద్భుతమయిన ప్రదర్శన కనబరిచారు అని కూడా చెబుతున్నారు. పంపిణిదారుల నుండి వస్తున్న సానుకూల స్పందన చూసి మంచు మనోజ్ మేఘాలలో తేలిపోతున్నారు. ” చాలామంది పంపిణిదారులు “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రాన్ని చూశారు అందరికి నచ్చింది, థియేటర్ల సంఖ్యను పెంచాలని అనుకుంటున్నారు” అని మనోజ్ ట్విట్టర్లో తెలిపారు.ఈ చిత్ర ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది ఈ వారంలో విడుదల అవుతుంది. లక్ష్మి మంచు, దీక్ష సెత్, సోను సూద్ మరియు సాయి కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. శేఖర్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లక్ష్మి మంచు నిర్మించిన ఈ చిత్రానికి బోబో శశి సంగీతం అందించారు. ఈ చిత్రం జూలై 27న విడుదల కానుంది.